ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియా  స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాక్ తో సంబంధం లేకుండా సినిమా కలెక్షన్స్ రాబడతాడు. మాస్టర్ జనవరి 13న విడుదలైన సంగతి తెలిసిందే. "ఖైదీ" సినిమా  డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకొని విజయ్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. ఇక "మాస్టర్"  సినిమా తమిళనాడు అంతటా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నట్లు సమాచారం. ఇది ఆల్ టైమ్ రికార్డులలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న రెండవ సినిమా. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో కూడా మంచి ఓపెనింగ్స్ ను అందుకొని మిశ్రమ స్పందన తో ముందుకు సాగుతోంది. ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్‌లో రీమేక్ కోసం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

కోలీవుడ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, మాస్టర్స్ హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎండెమోల్ షైన్ మరియు సినీ 1 స్టూడియోలు భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్. విజయ్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ వారి స్టార్ డమ్ ఇంకా నటనతో  సినిమాకు ఎంతగానో హైప్ తెచ్చారు."మాస్టర్" సినిమాను ఇంకా బాగా తెరకెక్కించవచ్చని బాలీవుడ్ నిర్మాతలు సరైన కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా మాస్టర్ గా విజయ్ చేసిన పాత్ర కోసం ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటారు అనేది బిగ్గెస్ట్ సస్పెన్స్. ఇక త్వరలోనే ఆ విషయంలో క్లారిటీ రానున్నట్లు సమాచారం.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: