ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎనర్జిటిక్ హీరో రామ్  "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్న రామ్  పోతినేని చాలా రోజుల తరువాత "రెడ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ లో ఘన విజయం సాధించిన  "తడమ్" సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా స్రవంతి రవికిశోర్ నిర్మించారు. గురువారం విడుదలైన ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇక రెడ్ సినిమా ద్వారా ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియదు గాని తప్పకుండా తరువాత  సినిమాలు మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉండాలని చూసుకుంటున్నాడు.

డాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ తో కలిసి పని చేసిన తరువాత ఆయన లాంటి మరికొంత మంది స్టార్ట్ దర్శకులను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ తో ఆల్ మోస్ట్ సెట్టయినట్లే. తప్పకుండా త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఆయన సినిమా అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సైరా అనంతరమే సురేందర్ రెడ్డి, రామ్ కాంబినేషన్ కు సంబంధించిన రూమర్స్ చాలానే వచ్చాయి.

ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ సినిమా తరువాత అతనితోనే వర్క్ చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ 5వ సినిమా కోసం మంచి కథని రెడీ చేసి హిట్ కొట్టాలనే ప్లాన్ లో వున్నాడట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: