టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో మహేష్ బాబు ప్రథమ స్థానంలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు పెరిగేకొద్ది మరింత అందంగా కనిపించడం బహుశా ఒక్క మహేష్ బాబు కు మాత్రమే సాధ్యం. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ అందం విషయంలో తన తరువాతే ఎవరైనా అని నిరూపిస్తూనే ఉన్నాడు. తాజాగా మంచు విష్ణు మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ విపరీతంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.  

మంచు విష్ణు భార్య విరానికా పుట్టినరోజు వేడుకకు పాల్గొన్న మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత శిరోథ్కర్ కలిసిఉన్న ఫోటో ను మంచు విష్ణు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ మహేష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. "ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యువకుడిలా మారిపోతున్నారు. 

రోజురోజుకి ఈయన అందం మరింత  పెరుగుతూ ఉంది. దీనికి కారణం బహుశా మంచి తనం, దయా హృదయమే అయ్యి ఉండవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను" అని ట్విటర్ లో రాసుకొచ్చాడు. దీనికి మహేష్ బాబు కూడా సమాధానం ఇస్తూ తమకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చారంటూ మంచు విష్ణు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. తన అభిమాన హీరో అందాన్ని పొగుడుతూ మంచు విష్ణు చేసిన ట్వీట్‌పై మహేశ్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: