బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ యువ హీరో మరణించి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఇతని గురించి ఏదో విధంగా సోషల్ మీడియాలో తన అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెర సీరియల్స్, పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా సుశాంత్ సింగ్ మృతికి కారణాలు వెలువడలేదు.తాజాగా సుశాంత్ కు సంబంధించిన లేఖను తన సోదరి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడు స్వయంగా రాసుకున్న లేఖను సుశాంత్ అభిమానులతో పంచుకున్నారు. ఈ లేఖలో సుశాంత్ ఆలోచనలు, తన లక్ష్యాలను మనకు తెలియజేస్తాయి. సుశాంత్ గత 30 సంవత్సరాల క్రితం వరకు ఎలాంటి విషయాలలో విజయం సాధించాడు ఎలా ఉండాలనుకున్నాడో, రకరకాల విషయాలలో టెన్నిస్, స్కూల్, గ్రేడ్స్ వంటి విషయాలలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సాగే ఈ లేఖ తాజాగా బయటపడింది.

సుశాంత్ రాసిన లేఖలో ఏముందంటే... 30 సంవత్సరాల వరకు నేను అనుకున్నట్టే అన్ని సాధించాను. ఏ స్థితిలో ఉన్నాం అనే విషయం పై అంతగా సంతృప్తి లేకపోయినా.. ఆయా విషయాలలో మంచిగానే ఉన్నాను.కానీ ఒక్కసారిగా వెనక్కి వెళ్లి చూసుకుంటే నా ఆట మొత్తం తప్పు ఆడానని తెలుసుకున్నాను. ఎందుకంటే అంతకు ముందే నేను ఏమైయున్నానో దానికోసమే అన్వేషిస్తున్నా.. అంటూ ఆ లేఖను ముగించాడు. సుశాంత్ రాసిన ఈ లేఖను తన సోదరి ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ  ''ఫర్‌ఎవర్ సుశాంత్''అనే ట్యాగ్ లైన్ జతచేశారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: