మాస్ మహారాజ్ రవితేజ చాలా రోజుల తరువాత భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.దాదాపుగా " మిరపకాయ్ " సినిమా తరువాత సరైన హిట్ లేని రవితేజ స్టార్ రేస్ లో బాగా బాగా వెనుకబడ్డాడు. ఇక స్టార్ గా పూర్తి డైలమాలో ఉన్న తరుణంలో" క్రాక్ " సినిమాతో వచ్చి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. అంతే కాదు ఈ సినిమా రవితేజ కు మాత్రమే కాకుండా తెలుగు పరిశ్రమ కు కూడా కీలకమైన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కారణంగా దాదాపుగా ఏడాది కాలంగా సినీ థియేటర్స్ మూత పడ్డాయి.

 దీంతో ప్రజలు థియేటర్స్ కి రారు అనే అనుమానాలు సినీ మేకర్స్ మధిలో ఉన్న మాట వాస్తవమే. ఈ నేపద్యంలో థియేటర్స్ రీ ఓపన్ చేసిన తరువాత మొదటి థియేటర్ సినిమాగా సాయి తేజ్ నటించిన 'సోలో బతుకే సొ బెటర్ " రాగా ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి తరువాతి సినిమాలు కూడా మెల్లగా థియేటర్స్ బాట పట్టాయి. ఈ నేపద్యంలో రవి తేజ నటించిన "క్రాక్ " సినిమా థియేటర్స్ లో 50 మాత్రమే ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నప్పటికి భారీ వసూళ్లు నమోదు చేస్తుంది. దీంతో సినీ పరిశ్రమ ఊపిరి పిల్చుకుంది.

 మాస్ మహారాజ్ ఇచ్చిన దైర్యంతో సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పాలి..ఇదిలా ఉండగా మాస్ మహారాజా రవితేజ "క్రాక్ " సినిమాతో మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఈ ఏడాది క్రాక్ తో పాటు సంక్రాంతి బరిలో నిలిచిన రామ్ 'రెడ్', విజయ్ 'మాస్టర్', బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' చిత్రాలని తోసి క్రాక్‌ను ఫస్ట్‌ ప్లేస్ లో నిలవటం విశేషం. అయితే రవితేజకు ఇలా సంక్రాంతి విజేతగా నిలవటం ఇది తొలిసారి కాదు. గతంలోనూ 2008 లో కృష్ణ తోను, 2011లో మిరపకాయ్ తోను సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: