అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను మీద వేసుకుంది సమంత. సినిమాలతో పాటుగా ఆమె డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్తుంది. ఈమధ్యనే సామ్ జామ్ షోతో ఆహా అనిపించిన సమంత తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. తన సినిమాలనే కాదు మిగతా అక్కినేని హీరోలను కూడా సెట్ రైట్ చేసే పనిలో ఉంది సమంత. లేటెస్ట్ గా సమంత అఖిల్ నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాతో అఖిల్ మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ రాజ్, డికే లతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ చేయడం వెనక సమంత హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. సమంత వారితో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసింది. మరిది కెరియర్ సెట్ చేసే పనిలో సమంత చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అఖిల్ బ్యాచ్ లర్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేస్తున్నాడు. రాజ్, డికే సినిమా కూడా త్వరలో లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది.

సమంత సహాయంతోనే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు నాగ చైతన్య సినిమాల మీద కూడా సమంత హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. మజిలీ, వెంకీమామ హిట్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ప్లాన్ చేస్తున్నారు.                              

మరింత సమాచారం తెలుసుకోండి: