మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. క్రాక్ వారం రోజుల్లో 20 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. సంక్రాంతి క్లియర్ విన్నర్ గా క్రాక్ సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా రవితేజ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తున్నాయి. గోపీచంద్ మలినేని రవితేజని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు.

థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా సరే రవితేజ క్రాక్ రికార్డ్ వసూళ్లు రాబడుతుంది. వారం రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల షేర్ తో టాక్ ఆది ది ఇండస్ట్రీగా మారింది. రవితేజ క్రాక్ సినిమా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రాగా వారం రోజుల్లో ఈ సినిమా 20 కోట్లతో లాభాల బాట పట్టింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. 2021 లో రవితేజ క్రాక్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ దూకుడు మొదలైంది. ఈ సినిమాలో రవితేజ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రవితేజ క్రాక్ దూకుడు చూస్తుంటే మరో రెండు వారాలు ఇదే హవా కొనసాగించేలా ఉన్నారు. క్రాక్ సినిమా 20 కోట్ల వసూళ్లతో దుమ్ముదులిపేస్తుంది. క్రాక్ తో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ అందుకున్న ఈ సినిమా హిట్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు మాస్ రాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: