మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్. శృతిహాసన్ హీరోయిన్ గా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి.మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు.  ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని అన్ని ఏరియాల్లో కూడా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

అంతకుముందు కెరీర్పరంగా వరుసగా పరాజయాలతో సతమతమైన మాస్ రాజా రవితేజ కు ఈ మూవీ సక్సెస్ మంచి బూస్ట్ అందించింది అనే చెప్పాలి. ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా రవితేజ మాట్లాడుతూ సినిమా కోసం యూనిట్ మొత్తం అహర్నిశలు ఎంతో శ్రమ పడిందని ముఖ్యంగా సినిమాకి ప్రాణం గా నిలిచిన తమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రేక్షకాభిమానులు నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. ఇకపై రాబోయే రోజుల్లో తప్పకుండా అభిమానులను అలరించే మంచి సినిమాలు చేస్తానని రవితేజ మాట్లాడుతూ చెప్పారు.

ప్రస్తుతం రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ఆకట్టుకునే సస్పెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. ఇక దీనితో పాటు ఇప్పటికే ఆయన మరొక మూడు సినిమాల్లో కూడా లైన్లో పెట్టినట్టు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ముగ్గురు దర్శకుల నుంచి కథలు విన్న రవితేజ అవి ఎంతో నచ్చడంతో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ కి చెందిన మూడు బడా నిర్మాణ సంస్థలు వాటిని ఎంతో గ్రౌండ్ లెవల్ లో నిర్మించనున్నాయని అతి త్వరలో వాటికి సంబంధించి అధికారికంగా ప్రకటనలు కూడా బయటికి రానున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే క్రాక్ సినిమా భారీ సక్సెస్ ఒక్కసారిగా రవితేజ కెరీర్ కి మంచి ఎనర్జీ ఇచ్చినట్లు కనబడుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: