బిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్ గజ్జర్ హంగామా తెలిసిందే. సీజన్ 4లో సక్సెస్ అయిన వారిలో ఆమె ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాల్లో నటించి మెప్పించిన మోనాల్ కెరియర్ లో వెనకపడ్డ తర్వాత బిగ్ బాస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బిగ్ బాస్ వల్ల లాభ పడ్డ వారిలో మోనాల్ ఒకరు. ఈ షో ముగిసిన తర్వాత మొదట ఛాన్సులు అందుకుంది కూడా మోనాల్ అని చెప్పొచ్చు. ఇప్పటికే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ లో ఆమె వన్ ఆఫ్ ది జడ్జ్ గా చేస్తున్న మోనాల్ గజ్జర్ సంక్రాంతికి వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది.

రంభ ఊర్వశి మేనక అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఈ సాంగ్ ఆమె కెరియర్ కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. అయితే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ లో మోనాల్ గజ్జర్ స్కిన్ షో అదిరిపోతుంది. తనకు వచ్చిన ఈ ఛాన్స్ ను ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న మోనాల్ గ్లామర్ షోతో స్మాల్ స్క్రీన్ లో షాక్ ఇస్తుంది. అంతేకాదు స్టేజ్ మీద డ్యాన్స్ మాస్టర్స్ కు హగ్స్ కూడా ఇస్తూ మరింత రెచ్చిపోతుంది మోనాల్.

తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉన్న మోనాల్ గజ్జర్ సిల్వర్ స్క్రీన్ తో పాటుగా స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటాలని చూస్తుంది. అంతేకాదు ఇప్పటికే మోనాల్ తో సినిమా చేసేందుకు రెండు మూడు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మోనాల్ గజ్జర్ కు బిగ్ బాస్ చాలా హెల్ప్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.          

మరింత సమాచారం తెలుసుకోండి: