దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ వ్యయంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలు ఇద్దరి ఫస్ట్ లుక్ టీజర్లకు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై మాత్రం అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొని ఉంది. నిజానికి గత ఏడాది జూలై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్కు ఆలస్యం కారణంగా ఈ ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. అయితే మధ్యలో కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన మరికొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడటంతో విడుదల కూడా మరికొన్నాళ్లు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఇంకా నిర్ణయం కాకపోవడంతో అటు మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఎంతో క్యూరియాసిటీ పెరుగుతోంది.

అయితే సినిమాకు సంబంధించి సాంగ్స్, ట్రైలర్ ఆ తర్వాత ప్రమోషన్స్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా ఎంతో జాగ్రత్తగా పక్కా  ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట దర్శకుడు రాజమౌళి. ఇటీవల దియేటర్స్ తెరవటంతో మెల్లగా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారని అయితే ఈ సినిమాకు సంబంధించి మరికొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో దీనిని ఈ ఏడాది ర ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి రాజమౌళి మనసులో ఏం ఉందో, ఆర్ఆర్ఆర్ విషయమై ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఇంతకీ పక్కాగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేటువంటి విషయాలన్నిటికీ సమాధానాలు రావాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు........!!

మరింత సమాచారం తెలుసుకోండి: