సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోవాలని తెగ తొందర పడుతుందట. ఇప్పటికే 37 ఏళ్లు వచ్చిన త్రిషకు సడెన్ గా పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది అని డౌట్ రావొచ్చు. తను సింగిల్ గా ఉన్నందుకు ఎవరికి పడితే వారికి లింక్ చేసి నానా రచ్చ చేస్తున్నారు మీడియా వారు. అందుకే తనకు తగిన జోడీని వెతుక్కునే పనిలో పడ్డది త్రిష. కొన్నాళ్ల క్రితం చెన్నై బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న త్రిష పెళ్లిని క్యాన్సిల్  చేస్తుంది.

ఇక రానాతో రిలేషన్ గురించి మీడియా ఎప్పుడూ త్రిషని ఎటాక్ చేస్తూనే ఉంటుంది. రానా ఈమధ్యనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఫోకస్ మారింది. రీసెంట్ గా కోలీవుడ్ హీరో శింబుతో త్రిష మ్యారేజ్ అని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరితో తనని జోడించి వార్తలు రాయడం. అది కూడా తన పెళ్లిపై ఇంత డిస్కషన్స్ నడవడం త్రిషకు ఇబ్బందికరంగా ఉందట. ముఖ్యంగా త్రిష ఫ్యామిలీ ఈ విషయంలో హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది. అందుకే త్రిష పెళ్లి చేసుకోవాలని సిద్ధమైందని కోలీవుడ్ టాక్.

అయితే మనసుకి నచ్చిన అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నా అంటూ కొన్నాళ్ల క్రితం చెప్పిన త్రిష.. లవ్, ఎరేంజ్డ్ మ్యారేజ్ ల మీద కూడా తన ఒపీనియన్ చెప్పింది. మరి ఇంతకీ అమ్మడు ఫైనల్ గా పెద్దలు చూసిన మ్యారేజ్ చేసుకుంటుందా లేక లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా అన్నది చూడాలి. ఎలాగు సినిమా అవకాశాలు కూడా అరకొరగా వస్తుండటంతో త్రిష మనసు పెళ్లి వైపు మళ్లిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: