కొన్ని కాంబినేషన్ల పై క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. అలాంటి కాంబినేషన్ జాబితాలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ,కింగ్ నాగార్జున కూడా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ పై ఆడియన్స్ లో ప్రత్యేక ఆసక్తి ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో శివమణి (2003), సూపర్(2005) చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలలో శివమణి సూపర్ హిట్ గా నిలువగా సూపర్ యావరేజ్ గా నిలిచింది.

ఈ రెండు సినిమాలలో కూడా నాగార్జున క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఉంటూ అందరినీ అలరించింది. ముఖ్యంగా సూపర్ సినిమాలో నాగార్జున స్టైల్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా రావాలని నాగ్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి  కలయికలో ఓ సినిమా రాబోతోందని వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ లో పూరి నాగ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. నాగార్జున కోసం ఓ ఫాంటసీ స్టోరీ సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్టోరీ రాజుల కాలంనాటి కథ అనే వార్తలు వినిపిస్తున్నాయి..మరి ఈ కలయిక పై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ప్రస్తుతం నాగార్జున " వైల్డ్ డాగ్ " సినిమాలో నటిస్తుండగా , పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: