కరోనా మహమ్మారి ప్రజల పై విరుచుకు పడి దాదాపు నేటికీ సంవత్సర కాలం అవుతుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను  ఎదుర్కొనడానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురి కావలసి వచ్చింది. ఇలాంటి తరుణంలో కొందరు తన వంతు సహాయంగా ప్రజలకు చేయూత గా నిలిచారు. అందులో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎంతో మందికి చేయూతనందించి ప్రజల  దృష్టిలో రియల్ హీరోగా, మనసున్న మారాజు గా మన్ననలు పొందుతున్నారు. సోనుసూద్ సినిమాల్లో  విలన్ అయినప్పటికీ, నిజ జీవితంలో హీరో  అనిపించుకున్నాడు .సోనూసూద్ సినిమాల్లో తన విలక్షణమైన నటనతో అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలాగే నిజజీవితంలో కూడా సమాజ సేవ చేస్తూ ప్రజలకు అండగా నిలిచే రియల్ హీరో అయ్యాడు.

ముఖ్యంగా కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఎంతో మంది వలస కూలీలకు వారి సొంత ఊళ్లకు పంపడానికి బస్సులను ఏర్పాటు చేశారు. వలస కార్మికులకు ఉపాధి చూపడానికి   ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్ సైట్ ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు ఇలా రైతులకు విద్యార్థులకు యువతకు ఎందరికో సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

తాజాగా ఆచార్య సినిమా సెట్ లో  సోనూసూద్ టైలర్ గా అవతారమెత్తాడు. అక్కడున్న ఓ క్లాత్ ని తీసుకోని ప్యాంట్ కుట్టేందుకు ప్రయత్నించాడు. విఫలం కావడంతో ఆ వీడియోను సరదా కామెంట్ తో తన అభిమానులతో పంచుకున్నాడు. ‘సోనూసూద్ టైలరింగ్ షాప్. ఇక్కడ దుస్తులు ఫ్రీగా కుట్టబడును. కానీ ప్యాంట్‌లు నిక్కర్లు అవుతాయేమో.. ఆ విషయంలో గ్యారెంటీ లేదు’ అని సోనూసూద్ రాసుకొచ్చారు. ఇలా ఎప్పుడు సమాజ సేవలోనూ సినిమాలోని బిజీగా ఉండే సోనుసూద్ ఫన్నీ ఫన్నీ గా చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: