ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొన్ని సినిమాలు ఉంటాయి రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలో వున్న నటీనటులకి మంచి పేరుని క్రేజ్ ని తీసుకొస్తాయి. ఇక హీరోను మించిన క్రేజ్ ను సొంతం చేసుకుంటారు కొందరు నటులు. ఆ కోవకి చెందిన నటుడు విజయ్ సేతుపతి. సంక్రాంతికి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రివ్యూలు రాలేదు కానీ.. ఆడియన్స్ రెస్పాన్స్ అయితే  మాత్రం బాగానే ఉంది . తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదైన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ గా నిలిచేసేలా వుంది.

అయితే.. ఈ సినిమాలో హీరో విజయ్ కంటే విలన్ విజయ్ సేతుపతి నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. సినిమాలో కూడా విజయ్ ప్లే చేసిన జెడి కంటే సేతుపతి ప్లే చేసిన భవాని పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. సరిగ్గా రిలీజైన వారం రోజులకి సేతుపతి పుట్టినరోజు కూడా కావడంతో “మాస్టర్” క్రేజ్ క్రెడిట్ మొత్తం సేతుపతి ఎకౌంట్ లోకి వచ్చేసింది. పైగా ఇప్పుడు మాస్టర్ హిందీ రీమేక్ లో కూడా భవాని పాత్రను అక్కడ కూడా సేతుపతి చేత చేయించాలని హిందీ మేకర్స్ ఆలోచిస్తున్నారు.హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కే ఈ చిత్రంలో గనుక సేతుపతి ఛాన్స్ సొంతం చేసుకుంటే అతడి కెరీర్ గ్రాఫ్ మరో స్థాయికి చేరిపోయినట్లే. ఇక నుంచి సేతుపతి నటించే ప్రతి చిత్రం తెలుగులోనూ డబ్ అవ్వడం అనేది సర్వసాధారణం అయిపోతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: