ఈ మధ్య కాలంలో తెలుగులో రీమేక్ సినిమాలు ఎక్కువై పోయాయి. వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో తెరకెక్కిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. అది కూడా తెలుగులో బడా హీరోలను పెట్టి మరీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ సినిమా అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఆ సినిమాని తెలుగులో తీస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన లభించింది. అయితే ఈ నారప్ప సినిమాకి ఎవర్గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 

ఆయన తాజాగా ఈ సినిమా మీద ఈ సినిమా యూనిట్ మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే గతంలో ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ విడుదలైంది. అయితే ఈ సినిమా టీజర్ లో ఒరిజినల్ వర్షన్ ఆర్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ చేసి ఉండడంతో  మణిశర్మ మీద ట్రోల్స్ మొదలు పెట్టారు నెటిజన్లు. ఈ విషయం మీద మణిశర్మ తాజాగా స్పందిస్తూ సినిమాకి నన్ను పనిచేసుకోనిస్తే బాగుండేది, వాళ్లు నన్ను పనిచేయనివ్వడం లేదు, మొన్న ఏదో టీజర్ రిలీజ్ చేసి అందులో ఒరిజినల్ సినిమా లో మ్యూజిక్ వేశారు.

 అది పెద్ద కాంట్రవర్సీ అయింది నేను కాపీ కొట్టా అని చాలా మంది భావించారని ఆయన చెప్పుకొచ్చాడు. అసలు ఏమీ లేకుండానే ఇదంతా జరుగుతోంది అంటూ ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే సినిమా నిర్మాణాన్ని చాలా సీరియస్ గా తీసుకునే సురేష్ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుందా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో సహా నిర్మాతగా కలై పులి ధాను కూడా ఉన్నారు. బహుశా ఆయన మీద బాద్యతలు వదిలేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: