సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ ను కొనసాగించాలని చూస్తుంది. ఆల్రెడీ ఆచార్య, ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తున్న అమ్మడు ఆ సినిమాలు పూర్తి చేశాక వాటి ఫలితాలను బట్టి నెక్స్ట్ సినిమాలకు కమిట్ అవుతుందని తెలుస్తుంది. బోయ్ ఫ్రెండ్ గౌతం కిచ్లుతో మ్యారేజ్ ఆ తర్వాత హనీమూన్ కు వెళ్లొచ్చిన కాజల్ ఆచార్య షూటింగ్ లో ఈమధ్యనే పాల్గొన్నది. ఇక పెళ్లి తర్వాత ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న కాజల్ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది.

అభిమానులు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతుంది. రీసెంట్ చాట్ లో భాగంగా ఓ అభిమాని మీరు దేనికి ఎక్కువ సంతృప్తి చెందుతారని అడిగితే.. ఆమె తెలివిగా తన వర్క్ పర్ఫెక్ట్ గా చేసినప్పుడు సంతృప్తిగా ఉంటానని అన్నది. ఏదైనా షూటింగ్ లో కెమెరాలో తన యాంగిల్ చూసుకుని బాగా వచ్చిందని అనిపిస్తే అప్పుడు తను చాలా సంతృప్తి చెందుతానని అన్నది. గౌతం తో మ్యారేజ్ తర్వాత తన లైఫ్ చాలా అందంగా ఉందని అంటున్న కాజల్ సినిమాల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదని అంటుంది.

కమర్షియల్ సినిమాలే కాదు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు సై అంటుంది కాజల్. తన భర్త తన వర్క్ పట్ల చాలా క్లియర్ గా ఉన్నాడని. సినిమాలు ఎప్పటిలానే చేస్తానని అంటుంది కాజల్. చూస్తుంటే సమంతలానే కాజల్ కూడా పెళ్లి తర్వాత అదే ఫాం కొనసాగించేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: