మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం " క్రాక్ " సంక్రాంతి కానుకగా వచ్చి ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. వరుస ఫ్లాప్ లతో స్టార్ రేస్ లో పూర్తిగా వెనుకబడ్డ రవితేజ ను తిరిగి స్టార్ రేస్ లో నిలబెట్టింది ఈ చిత్రం. విడుదలై దాదాపుగా తొమ్మిది రోజులు కావొస్తున్న ఇంకా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. పోటీలో ఇంకా మూడు సినిమాలు ఉన్నప్పటికి మాస్ మహారాజ్ దూకుడు ముందు ఆ మూడు సినిమాలు స్లో అయ్యాయని చెప్పాలి.

ఇక ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే టాప్ గ్రాసర్ వైపుగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ రెండవ సారి జత కట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతా లో వేసుకున్నాడు.  మరి అలాగే ఈ చిత్రం ఇప్పటికే అన్ని చోట్లా కూడా కేవలం 50 శాతం సీటింగ్ తోనే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది.మరి అయినప్పటికీ ఈ చిత్రం రెస్పాన్స్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అన్ని వర్గాల నుంచి ఇంకా మంచి ఆదరణ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరిన్ని థియేటర్ లు పెంచుకుంటుంది.

 రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి గాను థియేటర్లు పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఆయా బాషల్లోకి రీమేక్ చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సినిమా హిందీ రీమేక్ హక్కులకు గాను సోనూ సూద్ ఆల్రెడీ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క తమిళ్ లో కూడా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం మంచి పోటీ నెలకొందట. ప్రముఖ బ్యానర్ సంస్థలు క్రాక్ రీమేక్ హక్కులను కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: