యంగ్ అండ్ ఎనర్జటిక్ యాక్టర్ రామ్ పోతినేని తన ఎనర్జటిక్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరించడంలో ముందుంటాడన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా "రెడ్"తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తమిళ్ మూవీకు తెలుగు రీమేక్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది.

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా రామ్ మీడియాతో ఇంటరాక్ట్ అవడం జరిగింది. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి రామ్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇద్దరు టాప్ డైరెక్టర్స్ తో రెండు ప్రాజెక్ట్స్ వెయిటింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

వాటిలో ఒకటి సురేందర్ రెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ అనన్నాడు. మరొకటి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

సురేందర్ రెడ్డి "అతనొక్కడే" మూవీతో తెరంగేట్రం చేశాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. యాక్షన్ డ్రామా 'కిక్'తో కూడా సురేందర్ కు మంచి పేరే వచ్చింది. హీరోలను స్టైలిష్ గా చూపిస్తూ అదే సమయంలో మాస్ అప్పీల్ ను కూడా హైలైట్ చేయడం సురేందర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అల్లు అర్జున్ "రేసుగుర్రం" సినిమాలో ఈ విషయంపై క్లారిటీ బాగా వస్తుంది.

ఇటీవలే, సురేందర్ రెడ్డి "సైరా" మూవీతో అలరించాడు. ఆ తరువాతి ప్రాజెక్ట్స్ లో ఒకటి రామ్ పోతినేనితో కాగా మరొకటి అఖిల్ అక్కినేనితో అని టాక్.

ఇదిలా ఉంటే, రామ్ 'రెడ్' స్లో థ్రిల్లర్ అన్న పేరును తెచ్చుకుంది. ఎప్పుడో రిలీజ్ అవవలసిన రెడ్ లాక్ డౌన్ వల్ల ఆలస్యంగా విడుదలైంది. ఎట్టకేలకు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ రెండు పాత్రల్లోని వేరియేషన్ ను చూపించడంలో రామ్ నెగ్గుకొచ్చాడనే చెప్పుకోవాలి.

రామ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కూడా వేరియేషన్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే, ఒకటి సురేందర్ రెడ్డితో అలాగే మరొకటి త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: