తమ సినిమాలతో ఆకట్టుకుని యూత్ ని అలరిస్తున్న హీరోలు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్..  అయితే వారు చేస్తున్న తమ చిత్రాలు చూస్తుంటే ఒకే తరహా కథలని ప్రస్తుతం ఆ సినిమా టీమ్స్ రిలీజ్ చేస్తున్న అప్ డేట్స్ లను చూస్తే అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండగా పూరి జగన్నాధ్ కరణ్ జోహార్ లు కలిసి ఈ సినిమా ను నిర్మిస్తుండడం విశేషం..

ఫైటర్ అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా అన్ని భాషల్లో ఈ సినిమా టైటిల్ అందుబాటులో లేదని లైగర్ ని ఫైనల్ చేయబోతున్నారట.. ఈ మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.. నిన్న రిలీజ్ చేసిన ఓ ప్రీ పోస్టర్ లో బాక్సింగ్ గ్లోవ్స్ సింబల్ కనపడడంతో ఈ సినిమా ఆ నేపథ్యంలోనిదే అని నిర్ణయానికొచ్చేశారు అభిమానులు.. ఇకపోతే వరుణ్ తేజ్ నటిస్తున్న తన పదో సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనిదే.. ఈ విషయాన్ని మొదట్లో ప్రకటించిన చిత్ర బృందం.. అనుకోకుండా విజయ్ సినిమా ని పోలిఉండడం వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

దర్శకుడు గా కిరణ్ కొర్రపాటి వ్యవహరిస్తుండగా, ఈ చిత్రానికి 'బాక్సర్' టైటిల్ ఖరారు చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. ఈ మూవీద్వారా తనలోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేయబోతున్నాడు వరుణ్.ఇకపోతే వరుణ్ తేజ్ 'వీటీ10' టైటిల్ ఫస్ట్ లుక్ నుంచి జనవరి 19న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది యూనిట్. మంగళవారం ఉదయం 10.10 గంటలకు విడుదల చేయబోతున్నాారు. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ట్విటర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.అయితే.. విజయ్ దేవరకొండ ఫైటర్ ఫస్ట్ లుక్ జనవరి 18వ తేదీనే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది పూరీ టీం. సోమవారం ఉదయం 10.08 గంటలకు ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని అనౌన్స్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: