ఎమ్టీయార్ ని విజేతగానే చెప్పుకుంటారు. ఆయన పరాజయం అన్నది ఎరగరు. వచ్చినా కూడా దాన్ని అధిగమించి సూపర్ సక్సెస్ కొట్టేవరకూ ఆయన విశ్రమించేవారు కాదు. ఎన్టీయార్ ని సినీ సీమలో పని రాక్షసుడు అని అంతా అంటారు.

ఆయన రోజుకు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఆయన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో మూడు వందల యాభై దాకా సినిమాలు చేశారంటే ఏడాది పది చిత్రాలు అన్న మాట. అంటే దాదాపుగా నెలకు ఒక సినిమా. మరి ఒక సినిమాను పూర్తి చేయాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈ రోజులలో ఒక హీరో సినిమా రిలీజ్ కావాలంటే ఏడాది రెండేళ్ళు పడుతోంది.

మరి ఎన్టీయార్ నెలకు ఒక సినిమా రిలీజ్ చేయడం అంటే అది పెద్ద రికార్డుగా చూడాలి. అంతే కాదు ఎన్టీయార్ ఎన్నో డిఫరెంట్ జోనర్లలో నటించారు. పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘికం మూవీస్ అన్న మాట.  ఇలా ఒక మూవీలో  కత్తులు కటాలు పట్టేవారు. మరో మూవీలో  నెత్తి మీద బరువైన కిరీటాలు మోసేవారు. ఇంకో వైపు సోషల్ మూవీస్ లో ఫైట్స్,  సాంగ్స్   చేసేవారు. ఎన్టీయార్ సినీ కెరీర్ 1949న మనదేశం మూవీతో స్టార్ట్ అయింది. అందులో ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రను పోషించారు.

ఆ తరువాత ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఎన్టీయార్ కెరీర్ 1950, 160 దశకాలు అంటే రెండు దశాబ్దలా పాటు టాప్ లెవెల్ లో సాగిపోయింది. అన్నీ సూపర్ డూపర్ హిట్లే. అయితే 1970 దశకానికి వచ్చేసరికి కొంత డల్ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓ వైపు తన సినిమాలకు గాత్రదానం చేసే అద్భుతమైన గాయకుడు ఘంటసాల ఆ టైమ్ ,లోచనిపోయారు.

అదే సమయంలో క్రిష్ణ, శోభన్ బాబు వంటి యంగర్ జనరేషన్ హీరోలు హవా చూపిస్తూ సత్తా చాటుకున్నారు. ఇంకో వైపు సినిమా రంగంలో వచ్చిన మార్పులు, జనాల అభిరుచి కూడా మారడం వంటి కారణాల వల్ల ఎన్టీయార్ కొంత వెనకబడ్డారు. ఎన్టీయార్ ఘంటసాలకు బదులుగా బాలీవుడ్ గాయకుండ్ మహమ్మద్ రఫీతో తన సినిమాల్లో పాటలు పాడించుకున్నారు. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక మరో వైపు తాను ఎంచుకున్న సబ్జెక్టులు కూడా  తేడా కొట్టాయి.

ఆ సమయంలో బాల‌సుబ్రహ్మ‌ణ్యం గాయకుడుగా నిలదొక్కుకోవడం, అపుడే ఇండస్ట్రీలో హిట్లు కొడుతూ పైకి వచ్చిన కే రాఘవేంద్రరావు లాంటి వారితో జోడీ కట్టడం ద్వారా మళ్ళీ అడవి రాముడుతో ఎన్టీయార్ సూపర్ స్టార్ డమ్ సంపాదించారు. అది ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేంతవరకూ కొనసాగడమే కాదు, ఆయనే ఎప్పటికీ  సినీ సీమలో నంబర్ వన్ అనేలా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: