మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ - శృతీహాస‌న్ జంట‌గా తాజాగా తెర‌కెక్కిన సినిమా క్రాక్‌. మాస్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా కాస్త ముందుగానే రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ - సముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌రో విశేషం ఏంటంటే ఈ సినిమాకు పోటీగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ - రామ్ న‌టించిన రెడ్ - విజ‌య్ డ‌బ్బింగ్ మూవీ మాస్ట‌ర్ రిలీజ్ అయినా కూడా ఈ పోటీని త‌ట్టుకుని మ‌రీ క్రాక్ థియేట‌ర్ల‌లో దూసుకు పోతోంది.

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు అన్ని కేవ‌లం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ర‌న్ అవుతున్నాయి. అయినా కూడా క్రాక్ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపుతోంది. క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోనూ క్రాక్ సూప‌ర్ హిట్ అని చెప్పాలి. ముఖ్యంగా బీ, సీ సెంట‌ర్ల‌లో క్రాక్ సినిమా వీరంగం ఆడేస్తోంది. మ‌రో వైపు మాస్ట‌ర్‌, అల్లుడు అదుర్స్ సినిమాల‌కు కేటాయించిన థియేట‌ర్ల‌ను తీసేసి మ‌రీ క్రాక్‌కు కేటాయిస్తున్నారు. ఏదేమైనా క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన తొలి సంక్రాంతి హీరోగా ర‌వితేజ నిలిచాడు.

ఇక గ‌తంలోనూ ర‌వితేజ సంక్రాంతికి వ‌చ్చి మిర‌ప‌కాయ్‌, కృష్ణ సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టాడు. మ‌ళ్లీ ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత సంక్రాంతి విన్న‌ర్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే క్రాక్ కేవ‌లం తొలి వారంలోనే రికార్డు స్థాయి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు ఏపీ, తెలంగాణ‌లో రు. 21.50 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. గ్రాస్ ప‌రంగా చూస్తే ఇది రు. 38 కోట్లు అని తేలింది. ఇప్పుడు పండ‌గ హ‌డావిడి త‌గ్గినా కూడా క్రాక్ రోజుకు రు. 2 కోట్ల షేర్ తెస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: