బిగ్ బాస్ సీజన్ ఫోర్ కూడా కంప్లీట్ అయింది. విన్నర్ రన్నర్ కూడా బయటకు వచ్చారు. గత సీజన్ల మాదిరిగానే హైప్ ఎక్కువైంది కానీ కంటెస్టెంట్లకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని అంటున్నారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారంతా తమకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఆశ పడతారు.

కానీ ఇప్పటికి నాలుగు సీజన్లు దాదాపుగా డెబ్బై మంది దాకా కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. వారిలో ఏ ఒక్కరు కూడా లైమ్ లైట్ లో లేకపోవడం పైన కామెంట్స్ ఉన్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు కాస్తో కూస్తో పేరున్న వారు ఇంకా పెద్ద పేరు అవకాశాలు దక్కుతాయని ఆశిస్తారు. కానీ ఎవరికీ ఆ లక్ మాత్రం ఇప్పటిదాకా తలుపు తట్టలేదు.

ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ విషయంలో అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ టాప్ సిక్స్ గా  ఉన్న సినీ హీరోయిన్ మోనాల్ గజ్జార్ మాత్రం బయటకు వచ్చిన వెంటనే ఒక్క లెక్కన  వెలిగిపోతోంది. డ్యాన్స్ టూ రియాలిటీ షోకి మోనాల్ గ్లామరే అతి పెద్ద ఆకర్షణగా ఉందంటే నమ్మాల్సిందే. అంతే కాదు ఆమెకు రియాలిటీ షోలలో చాన్సులు వస్తున్నాయి. బయటకు వచ్చిన వెంటనే అల్లుడు అదుర్స్ మూవీలో ఒక ఐటెం సాంగ్ చాన్స్ కూడా కొట్టేసింది.

అంతే కాదు, మోనాల్ కి సినిమాలో మరిన్ని ఐటెం సాంగ్స్ ఆఫర్లు ఉన్నాయంటున్నారు. మొత్తానికి మోనాల్ లక్ మాత్రం బాగా తిరిగింది అని చెబుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా మోనాల్ సక్సెస్ అవుతూండడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోని మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఎపుడు లైమ్  లైట్ లోకి వస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందులో కొందరు కంటెస్టెంట్లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి రెడీ అవుతున్నారని న్యూస్ అయితే వచ్చింది. మరి వారి సినీ కెరీర్ ఎంతదాకా ముందుకు వెళ్ళింది అన్నది ఇంకా చూడాల్సి ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: