డేరింగ్ హీరో డ్యాషింగ్ డైరక్టర్ ఇద్దరు కలిసి చేసే ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకు ఫైనల్ గా టైటిల్ లైగర్ అని ఫిక్స్ చేశారు. పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. తెలుగులో తీసి తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారనుకున్న ఈ సినిమా పూర్తిగా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నట్టు పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ సినిమా కూడా ఎంత డ్యాషింగ్ గా ఉంటుందో చెప్పేశాడు.

సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ పాన్ ఇండియా సినిమా లైగర్.. పిచ్చెక్కించడం పక్కా అనేట్టుగా కామెంట్ చేశాడు. పూరీ, విజయ్ దేవరకొండ లైగర్ నిజంగానే బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉంది. ఇక పూరీ నిర్మాతగా మొదలు పెట్టిన ఈ సినిమా పూర్తి నిర్మాతగా కరణ్ జోహార్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ తో సూపర్ బజ్ ఏర్పరిచేలా చేశారు.

విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే. ఇక పూరీ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమాగా వస్తున్న లైగర్ 100 పర్సెంట్ అంచనాలను అందుకుంటుందని చెప్పొచ్చు. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెడుతుందా లేదా అన్నది చూడాలి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.  

                   

మరింత సమాచారం తెలుసుకోండి: