టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి సినిమాలు తగ్గించి మిగతా విషయాల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు రకాల బిజినెస్ లు చేస్తున్న ఈ భామ డిజిటల్ మీడియాలో తన సత్తా చాటుతోంది. అల్లు అరవింద్ కు సంబంధించిన ఆహా కోసం ఈ భామ ఒక షో చేస్తోంది. అలానే ఈ మధ్య టెర్రరిస్ట్ పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాతలు ప్రారంభించారు. 

ఈ సిరీస్ కి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమంత సడన్గా ముంబై బయలుదేరి వెళ్ళింది. తన సహ నటుడు మనోజ్ బాజ్పాయ్, ప్రియమణితో కలిసి ఈ భామ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక ఈ సిరీస్ మీద చాలా అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. . ఈ సిరీస్ మొదటి భాగం మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

ఈ రెండో సీజన్ లో సమంత ఎంట్రీ ఇవ్వడంతో ఈ సిరీస్ మీద మరిన్ని అంచనాలు పెరిగాయి అని చెప్పొచ్చు. తెలుగు దర్శక ద్వయం రాజ్ డీకే తన కెక్కించిన ఈ సిరీస్  కు మొన్న ఓటీటీ అవార్డ్స్ లో చాలా అవార్డులు దక్కాయి. ఇక సమంతా ప్రస్తుతానికి తెలుగులో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తమిళంలో నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: