పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కుర్రాళ్ళ లో ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఈ స్టార్ డైరెక్టర్ చిన్నప్పుడు తన స్నేహితుడితో కలిసి దిగిన ఫోటో ఇది. శ్రద్ధగా గమనిస్తే ఈ తెలుగు దర్శకుడు ఎవరో సులువు గానే గుర్తుపట్టవచ్చు. ఈయన ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని దృశ్యరూపంలో చూపించి వావ్ అనిపించారు. తెలుగు ప్రేక్షకులు ఎవరూ చూడని యాక్షన్ సన్నివేశాలను వెండితెరకు పరిచయం చేసి దుమ్ము రేపారు. ఇటీవల ఒక మంచి మాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఇంతకీ ఈయన ఎవరంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుకుమార్. ఫోటోలో నూనూగు మీసాలతో కనిపిస్తున్న కుర్ర సుకుమార్ కెమెరా వైపు చూస్తున్న లుక్ లో ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో మనం గమనించవచ్చు.

చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టక ముందు సుకుమార్ లెక్కల మాస్టర్ గా పని చేసేవారు. ఆ సమయంలోనే సినిమాలపై ఎంతో మక్కువ పెంచుకొని ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో 'ఆర్య' సినిమాని తెరకెక్కించి పెద్ద హిట్ సాధించారు. ట్రయాంగిల్ లవ్ లో కొత్త కోణం చూపించిన సుకుమార్ ని విమర్శకులు సైతం తెగ మెచ్చుకున్నారు. రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల మనసులను నేరుగా తాకిన సుకుమార్ ఆ తర్వాత జగడం సినిమాతో సరికొత్త యాక్షన్ సన్నివేశాలను రుచి చూపించారు.

ఐతే ఆర్య 2 సినిమా ప్రేక్షకుల్ని ఆశించదగ్గ స్థాయిలో అలరించలేదు కానీ 100 % లవ్ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి తన సత్తాను చాటుకున్నారు. 1. నేనొక్కడినే సినిమాతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. కానీ రంగస్థలం సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ తో మెగా హీరో తో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా తెరకెక్కించేందుకు సుకుమార్ అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: