సునీల్  సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. సుమారు 200 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. మొదట ఎక్కువగా హాస్య పాత్రలో నటించి, ఆ తర్వాత కథానాయకుడిగా ఎదిగాడు. సునీల్ నటించిన "నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్,నువ్వే నువ్వే, సొంతం,మనసంతా నువ్వే,అతడు,ఆంధ్రుడు" ఇలాంటి ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపును  తెచ్చుకున్నాడు. "అందాల రాముడు" సినిమా ద్వారా కథానాయకుడిగా తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సునీల్.

తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాద రామన్న" సినిమా భారీ హిట్ ను సాధించి పెట్టింది. ఇక ఈ సినిమాకు గాను సునీల్  కు స్పెషల్ జ్యూరీ  పురస్కారం కూడా లభించింది.2003 లో వచ్చిన నువ్వు నేను, 2006లో వచ్చిన ఆంధ్రుడు చిత్రాలకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ఇంతమంచి  హాస్యనటుడిగా పేరుపొందిన జీవిత కథను వింటే  మాత్రం ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. సునీల్ తన  ఐదవ సంవత్సరం లోనే తన తండ్రిని కోల్పోయాడు.

ఇక తన తల్లి సహకారంతో డిగ్రీ వరకూ చదివి, ఆ తరువాత అనేక నాటకాల్లో కూడా నటించాడు. ఇక సునీల్, త్రివిక్రమ్,ఆర్.పి.పట్నాయక్ లు మంచి రూమ్మేట్ కూడా. ఇప్పటికీ వీరు నివసించిన ఆ రూమ్ అలాగే ఉంది. సునీల్ కేవలం హాస్య నటుడు,కథానాయకుడు మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశాడు.

మోహన్ బాబును ఇన్స్పిరేషన్గా తీసుకొని,విలన్గా ఎదగాలనుకున్న సునీల్ కు కమెడియన్గా అవకాశాలొచ్చాయి. మన్మధుడు సినిమా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. మెగాస్టార్ కు వీరాభిమాని అయిన సునీల్,మెగాస్టార్ గారి డాన్సులను టీవీలో చూస్తూ, తను కూడా డాన్స్ నేర్చుకున్నాడట. ఇప్పుడు మరోసారి సరికొత్తగా విలన్ పాత్రల్లో నటిస్తూ, అందరినీ మెప్పిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో ఒక హాస్య నటుడు విలన్ గా మారితే ఎలా ఉంటుందో అని నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: