పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అతడికి మంచి పేరు వచ్చింది.అప్పటి నుంచి వెనుదిరిగి చూడని విజయ్.. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.


పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ని ఖరారు చేసారు. . కానీ ఈ సినిమా టైటిల్‌తో వేరే సినిమావాళ్లు తీసుకోవడంతో ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఒక టైటిల్ ఉండేవిధంగా తాజాగా ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా టైటిల్ ను ఉదయం 10 గంటలకు రివీల్ చేసిన యూనిట్, 'సాలా క్రాస్ బ్రీడ్' అని ఉప శీర్షిక పెట్టారు. కాగా, లైగర్ అంటే, మగ సింహం, ఆడ పులికి పుట్టే సంతానమన్న సంగతి తెలిసిందే. ఇవి మామూలు సింహం, పులికన్నా పెద్దగా ఉండటంతో పాటు సింహాల్లా గర్జిస్తాయి.

పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యహరిస్తున్నారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేరవకొండ బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకుని కనిపిస్తుండగా.. అతడి వెనుక ఒక చిరుత పులి, పెద్ద పులి కలిసి ఉన్న ఫొటో కూడా ఉంది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన హీరో విజయ్.. 'మా పాన్ ఇండియా సినిమాను సగౌరవంగా ప్రకటిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మ్యాడ్‌నెస్ రావడం గ్యారెంటీ' అంటూ అందులో రాసుకొచ్చాడు. దీంతో ఈ పిక్‌కు విపరీతమైన స్పందన వస్తోంది.ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. . పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. . ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్.లైగర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తున్నడట. మొత్తంగా ‘లైగర్’ టైటిల్ విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనే టాక్ వినబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: