తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్.టి.రామారావు ఈ లోకాన్ని విడిచి నేటికి అనగా జనవరి 18, 2021 కి 25 సంవత్సరాలు అవుతోంది. ఐతే నేడు ఆ మహానీయుడు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. 76 ఏళ్లకే తనువు చాలించిన ఎన్టీ రామారావు తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవంగా నిలిచిపోయారని అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఎన్టీరామారావు 1996లో హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించినప్పుడు హరికృష్ణ అమెరికాలో ఉన్నారు. ఐతే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న హరికృష్ణ ఆగమేఘాలపై ఇండియాకి తిరిగి వచ్చేశారు. అప్పటికే ఎన్టీఆర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. ఎన్టీఆర్ కడచూపు కోసం నందమూరి అభిమానులు ఎల్బీ స్టేడియానికి పోటెత్తారు. భారతదేశంలో అడుగుపెట్టిన హరికృష్ణ తన తండ్రి భౌతికకాయాన్ని చూసేందుకు విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికే వచ్చారు.

అయితే ఎన్టీఆర్ పార్థివదేహం చుట్టూ కూడా లక్ష్మీపార్వతి మరియు ఆమె కుటుంబ సభ్యులు చేరిపోయారు. నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఎన్టీఆర్ పార్థివదేహానికి ఆమడ దూరంలో ఉండి ఏడుస్తున్నారు. లక్ష్మీ పార్వతి   కారణంగానే ఎన్టీరామారావు చనిపోయారన్నట్లు చిత్రీకరించడానికి ఎన్టీరామారావు కూతుర్లు, కొడుకులు ఇలా దూరంగా ఉన్నారని అంటుంటారు. కానీ ఎప్పుడైతే ఎల్బీ స్టేడియం లోకి హరికృష్ణ సింహం లాగా అడుగుపెట్టారో.. ఆ మరుక్షణమే లక్ష్మీపార్వతి కుటుంబ సభ్యులు చెల్లాచెదురైపోయారు. ఒక యుద్ధవీరుడిగా హరికృష్ణ వస్తుంటే ఆయనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా అనుసరిస్తూ ఎన్టీఆర్ పార్థివదేహం వద్దకు వచ్చేసి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హరికృష్ణ రాకపోయి ఉంటే ఎన్టీఆర్ కూతుర్లు, కొడుకులు తమ తండ్రి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు దగ్గర నుంచి నిర్వహించలేకపోయావారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: