టాలీవుడ్ సినిమాలకు ముఖ్యమైన సీజన్ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి సీజన్ అని చెప్పాలి. ఆ సీజన్ పూర్తి అయింది కాబట్టి దాదాపుగా అన్ని సినిమాలు ఇప్పుడు సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఏకంగా ఈసారి సమ్మర్ సీజన్ ని పన్నెండు సినిమాలు టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేసిన 12 సినిమాల విశేషాలు ఒకసారి చూద్దాం. 

  1. వకీల్ సాబ్

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అవగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

  1.  రాధేశ్యాం..

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.

  1.  కే జి ఎఫ్ చాప్టర్ 2

రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి..మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

  1.  ఆచార్య

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు, దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

  1.  బాలయ్య బోయపాటి సినిమా

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మూడోసారి నటిస్తున్న సినిమా bb3..ఇంకా పేరు పెట్టని ఈ సినిమా కూడా సమ్మర్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  1.  టక్ జగదీష్

నాని హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  1.  లవ్ స్టోరీ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా కూడా సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

  1. విరాట పర్వం

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  1.  నారప్ప

వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా నారప్ప. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

  1.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అక్కినేని అఖిల్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా కూడా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  1.  చావు కబురు చల్లగా

కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సినిమా కూడా ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  1.  అరణ్య

పూర్తిగా అడవి నేపథ్యంలో రానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: