బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తనలోని మరోకోణాన్ని బయటకు తీసాడు. వ్యాపారవేత్తగా మారాడు. తెలంగాణ భాషపై ప్రేమతో తన బట్టల వ్యాపారానికి "ఊకో కాకా" అన్న పేరును ఫిక్స్ చేశాడు. ఎవరినైనా సైలెంట్ గా ఉండమని చెప్పడానికి తెలంగాణాలో కొంచెం చొరవతో "ఊకో కాకా" అనంటారు.
 
ఈ మాటను ఏకంగా బ్రాండ్ నేమ్ గా మార్చేశాడు రాహుల్. తెలంగాణలో ఎక్కువగా, "ఊకో, మస్తు చెప్పినావ్" అన్న మాటలు ఫ్రెండ్స్ మధ్య ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ పాపులర్ ఫ్రేజ్ ను రాహుల్ చాకచక్యంగా తన బట్టల బ్రాండ్ ను పాపులర్ చేసుకోవడానికి బాగానే వినియోగించుకున్నాడు రాహుల్. ఈ విషయంలో 'పిల్లగాడు మస్తు హుషారున్నాడు' అనంటున్నారు అభిమానులు.

ఈ బ్రాండ్ స్టోర్ ను మొట్టమొదటగా కరీంనగర్ లో ఓపెన్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో, అదే క్రేజ్ తో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్టోర్ ను లాంఛ్ చేయడం జరిగింది. కరీంనగర్ తో తనకున్న అనుబంధం వలన ఇక్కడే మొదటి షో రూమ్ ను ప్రారంభించడం జరిగిందని రాహుల్ చెప్పుకొచ్చాడు.

"ఊకో కాకా" బ్రాండ్ లో వివిధ రకాల షర్ట్స్, టీ షర్ట్స్, జీన్స్ అలాగే షార్ట్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ షో రూమ్ లో దుస్తులను రీజనబుల్ ప్రైస్ కే అందుబాటులో ఉంచడం జరుగుతోంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు రాహుల్.

ఇదిలా ఉంటే, హైదరాబాద్ లోని ఈ స్టోర్ ఓపెనింగ్ లో అషు రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాహుల్, అషును ఎత్తుకుని తన ఫ్రెండ్ గురించి ప్రేమగా పోస్ట్ షేర్ చేశాడు. పునర్నవితో బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ లవ్ ట్రాక్ నడిపిన విషయాన్ని గుర్తుతెచ్చుకుని 'రాహుల్, పునర్నవికి షాకిచ్చావా' అనంటున్నారు ఆడియెన్స్. ఏది ఏమైనా, రాహుల్ ఇప్పుడు అషుతో కలిసి సందడి చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: