అదేంటి కొడుకు సినిమాకి తండ్రి పోటీ పడడం అనుకుంటున్నారా ? అవును నిజమే చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య మూవీ, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఆర్ఆర్ సినిమాతో పోటీ పడనుందట. అయితే అది రిలీజ్ విషయంలో కాదనుకోండి. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతానికి చిరంజీవి ఆచార్య సినిమా కోసం అసలు బ్రేకులు తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అయినా సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నాడని ప్రకటించారు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు వచ్చే వారం ఒక అధికారిక ప్రకటన కూడా చేస్తారట. మరో పక్క ఆర్.ఆర్.ఆర్ కూడా దసరాకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ని కూడా జనవరి 26 వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కంబైన్డ్ టీజర్ ఏదీ విడుదల కాలేదు. రామ్ చరణ్ ని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ తో ఒక వీడియో, ఎన్టీఆర్ ని పరిచయం చేస్తూ రామ్ చరణ్ వాయిస్ తో మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ ఇద్దరినీ కలిపి ఒక టీజర్ విడుదల చేయాలని ఫ్యాన్స్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి 26వ తేదీన ఈ టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలా ఈ రెండు సినిమాలు పోటీ పడనున్నాయి అన్నమాట. అయితే రెండు సినిమాల్లోనూ రామ్ చరణ్ నటిస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: