తెలుగులో "విలేజ్ లో వినాయకుడు" అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ మూవీ ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోయింది. అయితే ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "భీమిలి కబడ్డీ జట్టు" చిత్రంలో నటించి కుర్రకారుని కట్టి పడేసింది.దీంతో అప్పట్లో ఈ అమ్మడు ఎంతో మందికి కలల రాణిగా కూడా ఉండేది. శరణ్య మోహన్ తెలుగులో తక్కువ సినిమాలే నటించినప్పటికీ చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారింది.

హ్యాపీ హ్యాపీ గా, భీమిలి కబడ్డీ జట్టు, విలేజ్ లో వినాయ కుడు, ముద్ర, తదితర చిత్రాలలో హీరోయిన్ పాత్రలో నటించింది.ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "కళ్యాణ్ రామ్ కత్తి" చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.వరుస సినిమాలతో కెరియర్ సవ్యంగా సాగిపోతున్న సమయంలో తన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తోన్న కానీ చివరగా శరణ్య మోహన్ 2015వ సంవత్సరంలో తెలుగు బాషలో తెరకెక్కిన "ముద్ర" చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమెకు ఇప్పటివరకు ఈమె ఎలాంటి సినిమాల్లో నటించ లేదు. తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 ఇతడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం వీరికి అనంత పద్మనాభన్ అరవింద్, అన్నపూర్ణ అరవింద్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక శరణ్య పూర్తిగా సినిమా లకు గుడ్ బై చెప్పేసింది. ఇటీవలే శరణ్య కి మళ్లీ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా నో చెప్పినట్లు సమాచారం.. ఈమె లాంటి ఎంతోమంది ఫెడవుట్ అయిపోయిన హీరోయిన్లు అందరూ తమకు మళ్ళీ ఛాన్స్ వస్తే ఎగిరి గంతులేస్తారు.. అలాంటిది ఈ అమ్మడు మాత్రం ఛాన్స్ వచ్చినా నో చెప్తుందంటే దీని వెనుక ఏవో కారణాలు ఉండుంటాయి అని ఇండ్రస్టీ లో పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: