అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప అంటూ ఈసారి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ గా ఊర మాస్ రోల్ లో కనిపించనున్నాడు అల్లు అర్జున్. రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గా పుష్ప మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పుష్పలో మరో స్టార్ హీరోని సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కోలీవుడ్ హీరో శింబు కనిపిస్తాడని తెలుస్తుంది. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. మన్మధ సినిమా టైం లో అతను ఇక్కడ కూడా సూపర్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని సినిమాలు అక్కడ ఇక్కడ వరుస ఫ్లాపులు అయ్యాయి. అందుకే శింబు కెరియర్ లో వెనకపడ్డాడు.

పుష్ప సినిమాలో శింబు నటించడం కన్ ఫార్మ్ అయితే మాత్రం అతని కెరియర్ కు మంచి బూస్టింగ్ వస్తుందని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్లుగా వెనకపడ్డ శింబు ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా ఎప్పుడో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శింబు పుష్ప సినిమాలో చేస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: