కొన్ని కొన్ని సినిమాలను చూస్తుంటే అచ్చం మన రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగిందని ఒకానొక సమయంలో అనిపిస్తూ ఉంటుంది. అంతేకదా మరి రియల్  లైఫ్ లో జరిగే ఇన్స్ డెన్స్ లను తీసుకునే రీల్లో పెట్టేది. అందుకే కొన్ని సినిమాలను చూస్తే మన చిన్ననాటి, పాత జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమా చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారట. బాల్యంలో తాను చూసిన పరిసరాలను, విన్న సంగతులను మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. మరి ఏ సినిమా చూసి మెగాస్టార్ కు తన బాల్యం గుర్తొచ్చిందో తెలుసా.. అదేనండి సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ‘క్రాక్’ సినిమా చూసే చిరు గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
మాస్ మాహారాజా కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ సినిమా ఏ రేంజ్ లో ఘన విజయం సాదించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక చిరు క్రాక్ ను క్యూబ్ లో చూసారు. చూడటమే ఆలస్యం డైరెక్టర్ మలినేని గోపీచంద్ కు ఫోన్ చేసి సినిమాకు సంబంధించిన విషయాలను ముచ్చటించారట. ఒంగోలులో చిరు చదువుకుంటున్న రోజుల్లో వేటపాలెం గ్యాంగ్ ల గురించి వారి అలవాట్ల గురించి నేను కూడా విన్నానని చిరంజీవి డైరెక్టర్ తో గుర్తుచేసుకున్నాడట.

 దీంతో పాటుగా ఒంగోలులో ముఖ్యంగా దీపాలు ఆర్పేసి మర్డర్లు చేయడం అనే అంశం గురించి కూడా డైరెక్టర్ తో మాట్లాడారట. ఇంకా ఒంగోలుకు సంబంధించి చిరంజీవి బాల్యంలో ఉన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సెట్ కు కూడా రమ్మని మలినేని గోపీచంద్ ను ఆహ్వానించాడర చిరు. సీనియర్ స్టార్ చిరంజీవి ఫోన్ చెయ్యడం.. గత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. ఆచార్య సెట్ కు కూడా ఆహ్వానించడంతో ‘క్రాక్’ డైరెక్టర్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: