దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలోని పాత్రలను ప్రత్యేకంగా ఎలివేట్ చేయాలని భావిస్తాడు. ముఖ్యంగా, లీడ్ రోల్స్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో రాజమౌళి చూపించే శ్రద్ధ అనిర్వచనీయం. తన హీరోలను తన సినిమాలకు మాత్రమే వర్క్ చేయమని కన్విన్స్ చేయడంలో రాజమౌళి దిట్ట.

ఒకే సమయంలో వేరు వేరు ప్రాజెక్ట్స్ ని ఒప్పుకుంటే తన సినిమాలోని పాత్రలో ఇన్వాల్వవడం కష్టంగా అవుతుందేమోనని భావించి వేరే సినిమాలకు కమిట్ అవవద్దని ముందుగానే చెప్పుకొస్తాడు రాజమౌళి.

కానీ, రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఈ గ్యాప్ లో రాజమౌళి సినిమాలో నటించే నటీనటులు బయటి ఆఫర్స్ ను ఎన్నో కోల్పోవలసి వస్తుంది. ఈ రూల్ ను ఇటీవలే రాజమౌళి సడలించాడో లేదా నటీనటులే జాగ్రత్తపడుతున్నారో అర్థమవటం లేదు.  

మొత్తానికి, "ఆర్ఆర్ఆర్"లో నటిస్తున్న ఇద్దరు హీరోలు బయటి ప్రాజెక్ట్స్ తో కూడా బిజీగా ఉన్నారు. అటు ఎన్టీఆర్, ఇటు చెర్రీ ఇద్దరూ వేరే ప్రాజెక్ట్స్ కు కూడా వర్క్ చేస్తున్నారు.

ఆడియెన్స్ ను అలరించాలంటే గ్యాప్ అవసరం లేదని వారు ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఆడియెన్స్ కు దగ్గరగా ఉండాలంటే వరుస ప్రాజెక్ట్స్ తో ముందుకు దూసుకుపోవాలని వీరు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా "ఆచార్య"లోని చెర్రీ ఫస్ట్ లుక్ విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ అదిరిపోయిందని ఆడియెన్స్ అంటున్నారు. ఈ లుక్ డిఫెరెంట్ గా ఉండటంతో ఈ సినిమాలో చరణ్ రోల్ ఏ విధంగా ఉండబోతోందో అన్న ఆసక్తిని ఫ్యాన్స్ ప్రదర్శిస్తున్నారు.

మొత్తానికి "ఆచార్య"లోని చరణ్ ఫస్ట్ లుక్ అదిరిపోవడంతో రాజమౌళి "ఆర్ఆర్ఆర్"లో మరిన్ని స్పెషాలిటీస్ ను జోడించాలని కంగారుపడుతున్నాడట. తన సినిమాలోని చరణ్ పాత్రను మరింత హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట.

"ఆచార్య"లోని చెర్రీ ఫస్ట్ లుక్ రాజమౌళికి నిద్రపట్టకుండా చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి, ఈ ఫస్ట్ లుక్ రాజమౌళిని తెగ ఆకట్టుకుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: