సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒక సినిమా తీస్తే, ఒక మోస్తరుగా హిట్ అవచ్చు లేదా భారీ సంచలనాన్ని సృష్టించవచ్చు. మరి తొలి సినిమా అంటే విజయాన్ని అయితే సాధించొచ్చు  కానీ నంది అవార్డును కొట్టేంత రీతిలో ప్రస్తుతం సినిమాలైతే లేవు. అప్పట్లో ఆ దర్శకుడు తన తొలి సినిమాతోనే నంది అవార్డును సాధించి, చరిత్ర రికార్డు సృష్టించాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు దాసరి నారాయణరావు. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా, కళాకారులకు అండగా చరమాంకం వరకు పనిచేశారు.దాసరి నారాయణ రావు చేసిన ఎన్నో పనులకు గానూ,ఆయనను  మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తించవచ్చు. డైరెక్టర్ గా,నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఇలా అనేక రంగాలలో రాణించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు దాసరి నారాయణరావు. ఈయన గురించి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

దాసరి నారాయణరావు 1997వ సంవత్సరంలో తెలుగుతల్లి అనే పార్టీని స్థాపించి, కొద్ది రోజులకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు . ఆ తర్వాత ఈయనను రాజ్యసభ సీటు వరించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బొగ్గు గనుల మంత్రిగా పని చేశారు.

శ్రీదేవి,మోహన్ బాబు,మహేష్ బాబు లాంటి 25 మంది ప్రముఖ నటులను  సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇక  టెక్నీషియన్స్ ని అయితే లెక్కేలేదు. సర్దార్ పాపారాయుడు,బొబ్బిలి పులి లాంటి సినిమాలు తీసి ఎన్టీఆర్ కు రాజకీయంగా కూడా బాగా హెల్ప్ చేశారు. అంతేకాకుండా 1986 వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు . రెండు జాతీయ అవార్డులను, తొమ్మిది నంది అవార్డులను, నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా పొందారు.

శివరంజనీ, మేఘసందేశం అనే పేర్లతో 2 సినిమా వార్తా పత్రికలను కూడా నడిపారు.ఇక 121 సినిమాలకు దర్శకుడిగా పనిచేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు దక్కించుకున్నారు . ఇక ఈనాడు పత్రికకు పోటీగా ఉదయం అనే పత్రికను స్థాపించి,సంచలనాన్ని సృష్టించారు. తాతా మనవడు సినిమాకు మొదటి దర్శకత్వం వహించి, ఆ సినిమాకు నంది అవార్డును  కూడా అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: