ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవ్వరి జీవితం ఎలా మలుపులు తిరుగుందో ఎవరికీ  తెలియదు.ఎందుకంటే ఈరోజు ఉన్న క్రెజ్ మరొక రోజు ఉండదు. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు కొత్త కొత్త హీరోలు వస్తూ ఉంటారు కాబట్టి. ఒకప్పుడు విజయం బాటలో నడిచిన హీరోలు రాను రాను ఓటమి పాలు అవుతున్నారు. తీసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతుంది . అలా  సరైన హిట్స్ ని సొంతం చేసుకోలేక పోతున్న హీరోల్లో ఆరడగుల అందగాడు  గోపీచంద్ కూడా ఒకరు అని చెప్పాలి. కెరీర్ మొదట్లో హీరోగా నటించాడు. ఆ తరువాత అవకాశాలు రాక  విలన్ క్యారెక్టర్స్ చేసాడు. అప్పుడే గోపిచంద్ కి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత మెల్లమెల్లగా  హీరోగా మారి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్స్ ని సొంతం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.  గోపీచంద్ తీసిన చాలా సినిమాలల్లో కొన్ని మాత్రమే  హిట్స్ తప్ప ఎక్కువగా ఫ్లాఫ్స్ నే ఉన్నాయని చెప్పాలి . ప్లాప్స్ ఉన్నాగాని గోపిచంద్ రేంజ్ మాత్రం తగ్గలేదు. వరస సినిమాలు తీస్తూనే వచ్చాడు. సాహసం, లౌక్యం లాంటి రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో  గోపీచంద్ దిశ మారిపోయింది అని అనుకున్నారు అందరు. కానీ ఆ విజయాల తరువాత ఇప్పటిదాకా గోపీచంద్ తీసిన ఏ  సినిమాలు హిట్ అవ్వలేదు. అయినాగానీ గోపీచంద్ కి  సినిమాల ఆఫర్స్ మాత్రం ఏమి తగ్గలేదు.

ప్రస్తుతం గోపిచంద్  సీటి మార్ సినిమా పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు  గోపీచంద్ కు సంబందించిన ఒక  లేటెస్ట్  రూమర్ ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే... వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన  ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఎఫ్ 2 సినిమాకి  సీక్వెల్  గా, ఎఫ్ 3 సినిమాను తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే f3 సినిమాలో ఇద్దరు హీరోలతో పాటు మరో కీలక రోల్ ఉండగా ఆ రోల్ కోసం మరో స్టార్ హీరో ని వెతుకుతున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి, ముందు రవితేజను అనుకున్నారు కానీ ఎందుకనో సెట్ కాలేదట,  అయితే ఇప్పుడు ఈ పాత్రలో  హీరో  గోపీచంద్ ని  కూడా రంగంలోకి దింపాలని అనుకుంటున్నారని ఇండస్ట్రీ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇద్దరు ఫ్రస్ ట్రేటర్స్ తో మూడవ పెళ్లయిన ఫ్రస్ ట్రేటర్ కూడా జాయిన్ అయితే బాగుంటుందని, ఆ పాత్రకి గోపీచంద్ బాగా సూట్ అవుతాడని దర్శకుడు అనిల్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో కనుక గోపీచంద్ నిజంగానే నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం.. అలాగే గోపిచంద్ కెరీర్ కు కూడా ఈ సినిమా ఒక ప్లస్ అవుతుంది.దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ న్యూస్ కనక నిజం అయితే గోపీచంద్ లైఫ్ మళ్ళీ గాడిలో పడినట్లే అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: