తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నేటికీ, నాటికి, ఎప్పటికీ నిలిచిపోయే దివంగత నటుడు నందమూరి తారక రామారావు వారసత్వంగా హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు వెండితెరకు పరిచయమయ్యారు. అయితే వారందరిలో ఒక్క బాలకృష్ణ మాత్రమే ఎన్టీఆర్ వారసత్వాన్ని 4 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో నట వారసత్వాన్ని 4 దశాబ్దాలు పైగా కొనసాగించిన నటీనటులు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎంతైనా నందమూరి బాలకృష్ణ చాలా మొండి వాడు. ఆయన వయసు పైబడినా కూడా సినిమాల్లో నటించడం మానేయ లేదు. ఐతే ఎన్టీ రామారావు తో బాలకృష్ణ చాలా సినిమాల్లో నటించారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. తాతమ్మకల

1974 లో ఎన్టీరామారావు దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ పై తాతమ్మ కల సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో ఎన్టీ రామారావు తోపాటు బాలకృష్ణ కూడా నటించారు. హరికృష్ణ కూడా ఒక కీలకమైన పాత్రను పోషించారు.

2. అన్నదమ్ముల అనుబంధం

ఎస్.డీ లాల్ దర్శకత్వంలో 1975లో తెరకెక్కిన అన్నదమ్ముల అనుబంధం సినిమా లో ఎన్టీరామారావు, బాలకృష్ణ అన్న, తమ్ముడిగా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బాగా వసూళ్లను రాబట్టింది.

3. వేములవాడ భీమకవి

1976 లో డి. యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన వేములవాడ భీమకవి సినిమాలో బాలకృష్ణ, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో టైటిల్ రోల్లో బాలకృష్ణ నటించారు. అయితే ఈ సినిమా హిట్ అయింది.

4. దాన వీర శూర కర్ణ

దాన వీర శూర కర్ణ సినిమా లో బాలకృష్ణ అభిమన్యుడు పాత్రను పోషించారు. ఎన్టీరామారావు కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు గా నటించి మెప్పించారు.

5. అక్బర్ సలీమ్ అనార్కలి

ఈ సినిమాలో అక్బర్ పాత్రలో ఎన్టీఆర్ నటించగా సలీం పాత్రలో బాలకృష్ణ నటించిన వావ్ అనిపించారు..

6. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు

1980 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "రౌడీ రాముడు కొంటె కృష్ణుడు" తండ్రీకొడుకులు అయిన బాలకృష్ణ ఎన్టీఆర్ నటించి మెప్పించారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే అనురాగ దేవత, సింహం నవ్వింది, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి చిత్రాల్లోనూ కలిసి నటించిన నందమూరి అభిమానులకు కన్నుల విందు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: