పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేయాల్సిందే.. అలాంటి పవర్ స్టార్ ఛాన్స్ వచ్చినా ఒకసారి మిస్ చేసుకుంది బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయని అడిగారట కాని ఆమె ఎందుకో చేయనని చెప్పినట్టు టాక్. అయితే మరోసారి పవన్ సినిమా కోసం అనసూయని తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో సినిమా వస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో అనసూయతో స్పెషల్ సాంగ్ చేయించాలని చూస్తున్నారట. అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన అనసూయ ఈసారైనా పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా అన్నది హాట్ న్యూస్ గా మారింది. బుల్లితెర మీద తన గ్లామర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం ఫాం కోల్పోలేదు.

స్మాల్ స్క్రీన్ మీదే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా అమ్మడు తన సత్తా చాటుతుంది. అనసూయ సినిమా చేస్తుంది అంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉండాలని ఆమె కోరుతుంది. అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయట్లేదని తెలుస్తుంది. మరి అనసూయ ఈసారి పవన్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: