ఈ ఏడాది  సంక్రాంతికి కానుకగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రవితేజ క్రాక్ ఇప్పటికే సంచలన వసూళ్లు సాధిస్తుంది. దాంతో పాటు విడుదలైన మూడు చిత్రాలు కూడా వేటికవే బాక్సాఫీస్ దగ్గర షాక్ చేస్తున్నాయి . అయితే సినిమా కలెక్షన్స్ పరంగా  రవితేజ అందరికంటే  ముందు వరుసలో ఉంటె .. బెల్లంకొండ చిట్టచివరి స్థానం లో  ఉన్నాడు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా విజయ్  మాస్టర్  సినిమా మంచి వసూళ్లతో ముందుకు దూసుకెళ్తుంది  . మరి ఈ సంక్రాంతి పర్వదినాన  విడుదలైన నాలుగు సినిమాల కలెక్షన్స్ గురించి  ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

సంక్రాంతి కానుకగా విడుదలైన మొదటి చిత్రం క్రాక్  జనవరి 9న ఈ చిత్రం విడుదలైంది .. విడుదల తేదీ నుండే క్రాక్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .. క్రాక్ సినిమాల కలెక్షన్ చూస్తే  ఇప్పటి వరకు 8 రోజుల్లోనే దాదాపు 24 కోట్ల షేర్ వసూలు చేసింది. పండగ బరిలో అందరికంటే ముందొచ్చిన మాస్ రాజా రవితేజ .. ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొని కలెక్షన్స్ పరంగా ముందు వరుసలో నిలిచాడు .. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్  ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది...  

సరిగ్గా భోగి పండగ రోజున  లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే  5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.50 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా పై నెగటివ్ టాక్ వచ్చిన నిమలతకి మాహారం లాభాలనే తీసుకొచ్చింది .. దాంతో క్రాక్ తో  పాటు విజయ్ మాస్టర్  కూడా ఈ సంక్రాంతి విజేతగా లిస్ట్ లో చేరాడు ..

ఇక  ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా తర్వాత రామ్ నుంచి వచ్చిన మరో  రెడ్. ఈ  సినిమాకు తొలిరోజు 6.7 కోట్ల కలెక్షన్స్ సాధించింది .. అలాగే  రెండో రోజు కూడా రెడ్ సినిమా దాదాపు 3 కోట్ల వరకు చేయగా రెండుల్లోనే రెడ్ సినిమా 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది .. అయితే ఇప్పటి వరకు 4 రోజుల్లో ఈ సినిమా 14 కోట్ల వరకు షేర్ వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు.

అయితే సంక్రాంతి కానుకగా విడుదలైన చివరి  చిత్రం అల్లుడు అదుర్స్  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ తొలిరోజు 2.3 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ పండగ బరిలో విడుదలైన నాలుగు చిత్రాల్లో వసూళ్ల పరంగా వెనుకంజలో ఉన్నది అల్లుడు అదుర్స్ సినిమా ఒకటే ..

మరింత సమాచారం తెలుసుకోండి: