ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....టాలీవుడ్ యంగ్ హీరో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా "అల్లుడు అదుర్స్" నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయల్ లు హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ చిత్రం.రియల్ హీరో  సోనూ సూద్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ‘సినిమా మొత్తం ‘కందిరీగ’ కు సీక్వెల్ గా ఉంది’ అనే కామెంట్లు కూడా వినపడ్డాయి.

ఇక వసూళ్ల విషయానికి వస్తే...‘అల్లుడు అదుర్స్’ సినిమా కి  13కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇందులో చాలా వరకూ నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.విడుదలైన 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.10కోట్ల షేర్ ను రాబట్టింది.

సంక్రాంతి పండుగ కావడంతో.. అల్లుడు బాగానే క్యాష్ చేసుకున్నాడు. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. ‘మరి బ్యాలన్స్ 3.90 కోట్ల షేర్ ను రాబడతాడో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: