ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎనర్జిటిక్ హీరో రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రాల తరువాత  నటించిన తాజా చిత్రం ‘రెడ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన ఈ చిత్రం. ఈ సినిమా లో  మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ లు హీరోయిన్లుగా నటించారు.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని  ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది అనే చెప్పాలి. విడుదలైన 4 రోజుల్లోనే ‘రెడ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం అని చెప్పాలి.

‘రెడ్’ సినిమాకి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 15.45 కోట్ల షేర్ ను నమోదు చేసింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 0.30 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. సోమవారంతో ఆ ఫీట్ కంప్లీట్ అవ్వడం ఖాయం అని తెలుస్తుంది. ఈ సినిమాతో రామ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయంలా అనిపిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: