ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం "క్రాక్". శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది .గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఆర్ధిక సమస్యల కారణంగా మొదటిరోజు ఈ చిత్రం కాస్త ఆలస్యంగా విడుదల అయ్యింది. దీంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో వీరు రవితేజ, గోపీచంద్ లు హ్యాట్రిక్ సాధించారు.

ఇక ‘క్రాక్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 8 రోజులకు గాను ఈ చిత్రం 25.51 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే లాభాలు అందుకోవడం  విశేషం! ఇప్పటికి ఈ చిత్రం 7కోట్ల పైనే లాభాలను అందుకుందట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: