స్మాల్ స్క్రీన్ అంటే టెలివిజన్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా షోస్ లో  యాంకర్స్ గా చేసి పాపులారిటీ  వచ్చి  ఆ  తరువాత  టాలెంట్  తో  సిల్వర్  స్క్రీన్  ఎంట్రీ  ఇచ్చిన  స్టార్స్ చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో ఇండియన్  సినిమా  కింగ్  షారుక్ ఖాన్ మొదలు లేటెస్ట్ సెన్సేషన్ రాకింగ్ స్టార్ యష్ వరకు చాలా మంది ఉన్నారు. వారు ఎవరెవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం.

యష్
టీవీ కన్నడ ఛానల్  లో  నంద  గోకుల  అనే  టెలీ సీరియల్ తో కెరీర్  స్టార్ట్  చేసిన  యష్  చాలా  సీరియల్స్  లో  యాక్ట్  చేసి  ఇప్పుడు  ఇండియన్ సినిమాలో పాన్  ఇండియా  స్టార్  గా  ఎదిగాడు.

విజయ్  సేతుపతి
నవరస, పెన్ అనే తమిళ్ సీరియల్స్  లో క్యారెక్టర్  ఆర్టిస్ట్  గా  కెరీర్  స్టార్ట్  చేసిన  విజయ్  సేతుపతి ఇప్పుడు అనేక విలక్షణ పాత్రలు చేస్తూ ఇండియన్  సినిమా  లోనే  వెర్సటైల్  యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

షారుఖ్ ఖాన్
1988 లో దిల్  దారియా  అనే  డైలీ  సీరియల్  తో  కెరీర్  స్టార్ట్  చేసిన  షారుఖ్ ఖాన్ ఆ  తరువాత  ఉన్మీద్, ఫౌజీ, వాగ్లేకి  దునియా  లాంటి  సీరియల్స్  చేసి  1992 లో  దీవానా  మూవీతో బాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చాడు.

రాజీవ్ కనకాల
సీతా మహాలక్ష్మి, ఋతు రాగాలు లాంటి పాపులర్ డైలీ సీరియల్స్ లో ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రాజీవ్ కనకాల ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరిగా ఉన్నారు.

మాధవన్
మణిరత్నం సఖి మూవీతో హీరోగా మారి ఇండియన్ సినిమాలో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న మాధవన్ బనేగీ అప్నీ బాత్, సీ హాక్స్ , ఘర్ జమాయి, సాయా వంటి డైలీ సీరియల్స్ లో నటించాడు.

హన్సిక మొత్వాని
మన చిన్నతనంలో చాలా మందికి గుర్తుండి పోయిన షక లక బూమ్ బూమ్ అనే ఒక సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన హన్సిక ఆతర్వాత దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా మారి అనంతరం తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది.

ఇర్ఫాన్ ఖాన్
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుని చేసి ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడి మరణించిన ఇర్ఫాన్ దూరదర్శన్ లో సలాం బాంబే అనే సీరియల్ తో తన నట జీవితం ప్రారంభించారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్
గత ఏడాది సూసైడ్ చేసుకుని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమాల్లోకి రావడానికి ముందు పవిత్ర రిష్ట, కిస్ దేష్ మే అనే సీరియల్స్ లో హీరోగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: