టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.. రామ్.  ప్రస్తుతం హీరో రామ్ నటించిన "రెడ్" మూవీ సినీ ప్రేక్షకుల అంచనాలకు మించి విడుదలైన అన్ని సెంటర్లలో కలెక్షన్ల పరంగా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. సంక్రాంతి బరిలో వచ్చిన "రెడ్" మూవీ విజయం సాధించడంతో రామ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ మొదటి మూవీ "దేవదాసు" నుంచి మొన్నటి "ఇస్మార్ట్ శంకర్" , నిన్నటి "రెడ్" మూవీ లో తన ఎనర్జిటిక్ లెవెల్ ఏమాత్రం మిస్ కాకుండా తనదైన శైలిలో సినీ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు. రామ్ కు యూత్ లోను, మాస్ ఆడియన్స్ లోనూ క్రేజ్ ఉన్న హీరో.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" మూవీ హీరో రామ్ కెరీర్లో ఓ మైలురాయి. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ విడుదలైన అన్ని భాషల్లోనూ విజయం సాధించడంతో , సంక్రాంతి బరిలో వచ్చిన "రెడ్‌" మూవీ  మంచి విజయం సాధించింది . దాంతో  ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ను ఇతర భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ప్రజలు హీరో రామ్ మూవీ లను విపరీతంగా అభిమానిస్తున్నారు అట. ఇప్పటివరకు రామ్ నటించిన అన్ని సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ విజయం సాధించాయి.

 ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఒక యాడ్ లో రామ్, జాన్‌ అబ్రహంతో కలిసి నటించడంతో హీరో రామ్ కూడా బాలీవుడ్ వైపు వెళ్తున్నారని , ఇప్పటికే కొన్ని కథలని విని సెలక్ట్ చేశారని  ఫిలింనగర్ లో టాక్. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి యువ హీరోలు బాలీవుడ్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రామ్ కూడా బాలీవుడ్ సినిమాల వైపు అడుగులు వేయబోతున్నారు అని  అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: