నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలో రాబోతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఒకటి లీకైంది. బోయపాటి, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీని ఉగాది రోజు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. బిబి3 అంటూ ఇప్పటివరకు ఒక టీజర్ ను మాత్రమే వదిలిన బోయపాటి త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు మరో టీజర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను తెలుగు సంవత్సరాది ఉగాది రోజున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఉగాది అంటేనే తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ పండుగ అలాంటి పండుగ రోజు బాలయ్య సినిమా రిలీజైన పండుగ ఆనందం డబుల్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ కు అందుకే ఉగాదికి రెండు పండుగలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా టైటిల్ గా మోనార్క్ అన్నది పరిశీలనలో ఉంది.

నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా చూస్తున్నాడు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామ ఫ్లాప్ ఇచ్చిన షాక్ తో బాలయ్య సినిమాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట బోయపాటి శ్రీను. తప్పకుండా ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. సింహా, లెజెండ్ ల తరహాలోనే రాబోతున్న ఈ మూడవ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: