తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గొప్ప కమెడియన్. ఆయన చేసిన సినిమాలన్నీ అన్ని ఇన్ని కాదు. ఆయన నటనతో ప్రేక్షకులను నవ్వించి ఎంతోమంది అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని అది అభిమానులు తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం గారు ఆయన ఆరోగ్యం సమస్యలతో సినిమాలకు చాలా దూరం గా ఉంటున్నారు. అలాగే సినిమాలు తీయడం కూడా తగ్గించేశారు. బ్రహ్మానందం తన హార్ట్ సర్జరీ తర్వాత ఎక్కువగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. కానీ ఆయన మళ్ళీ తన నటనతో చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 ఒకప్పుడు సినిమాలో హీరో ఎవరు అయినప్పటికీ ఆ సినిమాలో కచ్చితంగా బ్రహ్మానందం ఉండేలా చూసుకునేవారు. ఒకప్పుడు సినిమాల్లో ఒక సినిమాకి హీరో తో పాటు కమెడియన్ కూడా అంతే అవసరం కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలలో అసలు కనిపించడం లేదు.ఆయన గతంలో తన నటనతోఎన్నో మంచి మంచి అవార్డులు రివార్డులు పురస్కారాలు అందుకున్నాడు.

 కానీ కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న రంగమార్తాండ సినిమా సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్  ఇప్పటి వరకు చేసిన రోల్స్  కు భిన్నంగా ఉంటాయి అని తెలియని తెలిపారు.అంతేకాకుండా ఇకమీదట చేయబోయే సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి అంటున్నారు.

 ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కి  బిన్నంగా ఉండటంలో ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు  అంటున్నారు.గతంలో బ్రహ్మానందం తనదైనశైలిలో బాబాయ్ హోటల్ సినిమాలో ఒక సీరియస్ రోల్ లో నటించాడు.కానీ ఆ సినిమా తరువాత కమెడియన్ గా  కొనసాగాడు. ఇక మీదట రంగమార్తాండ సినిమా తరువాత బ్రహ్మీ సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ రోల్స్ చేస్తాడు అని చెప్తున్నారు కృష్ణవంశీ. అదే జరిగితే ఇన్నాళ్ళు నవ్వించి అలరించినా బ్రహ్మానందం ఇకమీదట ఏడిపిస్తారు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: