సినిమా అనుకున్నప్పుడు ఒక హీరోయిన్ ను అనుకోవడం తీరా సెట్స్ మీదకు వెళ్లాక మరో హీరోయిన్ కు షిఫ్ట్ అవడం కామనే. అయితే ఇక్కడ దర్శక నిర్మాతలు తొలగించే కారణాల కన్నా హీరోయిన్సే చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. అప్పట్లో ఊపిరి సినిమాకు శృతి హాసన్ ఇలానే షాక్ ఇచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు కూడా త్రిష కూడా ఇలాంటిదే చేసింది. సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ దొరక్క పోవడంతో ఆల్రెడీ ఖైదీ నంబర్ 150తో కాజల్.. సైరాతో తమన్నా, నయనతారలతో నటించాడు చిరు.

ఆచర్య సినిమాకు త్రిషని తీసుకోవాలని అనుకున్నారు కాని ఎందుకో ఈ ప్రాజెక్ట్ నుండి అమ్మడు తప్పుకుంది. అంతా కుదిరాక త్రిష తప్పుకోవడంతో మళ్లీ కాజల్ నే ఫైన చేశారు. అయితే ఆచార్య సినిమా విశేషాలను తన అభిమానులతో పంచుకున్న కాజల్ సినిమా వేరే లెవల్ అన్నట్టు చెప్పింది. అంతేకాదు తన పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. కాజల్ అలా చెప్పడంతో త్రిష ఓ మంచి ఛాన్స్ మిస్సైందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

తమిళంలో 96 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిష తెలుగులో ఆచార్యతో మళ్లీ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉండేది. కాని ఈ సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో కాజల్ కు ఆ ఛాన్స్ దక్కింది. ఆచార్య సినిమాను కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో రాం చరణ్ పాత్ర కూడా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: