గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటె స్టెంట్ లకు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా మోనాల్ మాత్రం తరచూ ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఈ భామ ఉందనే సంగతి చాలా మందికి గుర్తు లేదు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దాదాపుగా చివరి వరకు ఉండడంతో ఈ భామకు ఇప్పుడు బాగా డిమాండ్ ఏర్పడింది. బయటకు వచ్చి రాగానే ఏకంగా అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ కూడా వచ్చింది. 


సినిమా హిట్ కాకపోయినా ఐటెం సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ నేపథ్యంలో ఈ భామను అప్రోచ్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందట. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని భావిస్తున్న ఈ భామ భారీగా రేట్లు పెంచే చేసిందని అంటున్నారు. తనతో ఐటెం సాంగ్ చేయాలి అంటే 50 లక్షలు దాక డిమాండ్ చేస్తోందట. అలాగే ఏవైనా షాప్ ఓపెనింగ్స్ లాంటివి చేయాలంటే దగ్గర దగ్గరగా పది లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.


 ప్రస్తుతానికి ఈ భామకి క్రేజ్ ఉండటంతో నిర్మాతలు అలాగే వ్యాపార వేత్తలు తమ తమ సినిమాల కోసం అలాగే వ్యాపార సంస్థల ఓపెనింగ్స్ కోసం ఈ భామ వెంట పడుతున్నారు. అలానే ఈ భామకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కువగా ఐటెం సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో మోనాల్ ఆలోచనలో పడింది అంటున్నారు. వరుసగా అవే చేసుకుంటూ వెళితే భవిష్యత్తులో ఇక నటించే అవకాశం ఉండదేమో అని ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. చూడాలి ఏమవుతుందో !

మరింత సమాచారం తెలుసుకోండి: