చాయ్ బిస్కెట్ కార్యక్రమంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన శ్రీ విద్య.. అసలు పేరు పాలపర్తి వెంటక సాయి నాగ యోగ శ్రీ విద్య. జర్నలిజం మాస్ కమ్యునికేషన్ చేసింది. యూట్యూబ్‌లో దివ్య శ్రీపాదతో కలిసి చేసిన ప్రమోషనల్ వీడియోస్‌ పాపులర్ కాగా.. సాఫ్ట్ వేర్ డెవలరప్ వెబ్ సిరీస్‌, కుందనపు బొమ్మ షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయ్యింది. 2017లో నటుడు అభిషేక్ మహర్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రి విద్య. అభిషేక్.. భలే మంచి రోజు, మహర్షి, జెస్సి వంటి చిత్రాల్లో నటించాడు. యాంకర్‌గా కూడా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంటాడు అభిషేక్. ఇక ఇటీవలే లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై హిట్ అయిన ‘కలర్ ఫొటో’ చిత్రంలో సునీల్‌కి వైఫ్‌గా నటించిన శ్రీ విద్య ఆ సినిమాలో కథను మలుపుతిప్పే పాత్ర చేసింది. లైఫ్‌లో అన్నింటికీ అడ్జెస్ట్ అయ్యే వైఫ్ పాత్రను నిజంగా అద్భుతంగా చేసింది శ్రీ విద్య. అయితే ఇదంతా రీల్ లైఫ్‌లోనే.. రియల్ లైఫ్‌లో మాత్రం పూర్తి భిన్నం శ్రీ విద్య.
 
 
 
 శ్రీవిద్య అంతరంగం గురించి ఇటీవలే వివరించింది. ఆ వివరాల్లోకి వెళితే... ‘మా అమ్మ నన్ను బయటకు వెళ్లేముందు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది అంటే నాకు కోపం వచ్చేస్తుంది.. అందుకే అడగదు. ఇప్పుడు అత్తారింటికి వెళ్లినా అదే ఫార్ములా. వాళ్లు కూడా అడగరు. అంతెందుకు మా ఆయన కూడా అడగరు. మా అత్త మామయ్యలు చాలా స్వీట్. వాళ్లు కూడా ఎక్కడకు వెళ్తున్నావ్.. ఎప్పుడొస్తావ్ అని అడగరు. మేం అంతా ఒకటే బిల్డింగ్‌లో ఉంటాం.. అత్త మామయ్యలు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు.. మేం ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటాం. అప్పుడప్పుడూ వెళ్తుంటా.. అత్త వండితే నేను వెళ్లి తెచ్చుకుంటా. నేను బయటకు వెళ్లి చాలా లేట్‌గా వస్తుంటా. అప్పుడప్పుడు ఎక్కడున్నావ్ అమ్మా అని మా అత్తయ్య ఫోన్ చేస్తుంటుంది. మా మావయ్య అయితే ఫుల్ ఫ్రెండ్స్‌లాగే ఉంటారు నాతో.
 
 
 
 ఇక మా ఆయన విషయానికి వస్తే.. మా ఇద్దరికీ ఒక అండర్ స్టాండింగ్ ఉంది. నీ లైఫ్ నీది.. నా లైఫ్ నాది.. ఇద్దరం కలిస్తే వన్ లైఫ్ అని అనుకుంటాం. ఈ వన్ లైఫ్ టుగెదర్‌లోనే అన్నీ షేర్ చేసుకుందాం అని ముందే ఫిక్స్ అయ్యాం. నీ లైఫ్‌లో ఏం జరుగుతుంది.. ఎక్కడ ఉన్నావ్.. ఎవరితో ఉన్నావ్ అన్నది నాకు అక్కర్లేదు. నా భర్తతో డిన్నర్‌కి వెళ్లాలని అనిపిస్తే.. ఆ టైంకి కాల్ చేస్తా.. వస్తావా?? వెళ్దామా అని. కుదిరితే వెళ్తాం లేదంటే ఎవరిదారి వారిది. నా లైఫ్ మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ అతనితో చెప్పాలని అనుకోను. అతను కూడా అంతే. లేట్‌గా వచ్చినా పెద్దగా పట్టించుకోను. ఇద్దరం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఇదే మెయిన్ రీజన్ నేను అతనికి కనెక్ట్ కావడానికి. కొంతమందికి భర్త ఎక్కడ ఉన్నాడు.. భార్య ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. ఎవరితో ఉంది అని కనుక్కోవడం ఇష్టం. మాకు ఇలా ఉండటం ఇష్టం. నాకు ఇలా వర్కౌట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీ విద్య.
 

మరింత సమాచారం తెలుసుకోండి: